BREAKFAST AND TIFFINS

Ravva puluhora|రవ్వ పులిహోర

ravva pulihora recipe
తయారుచేసే విధానం
*బియ్యం రవ్వలో పసుపు, టీస్పూను ఉప్పు, టీస్పూను నూనె వేసి ఒకటికి రెండు చొప్పున నాలుగు కప్పుల నీళ్లు పోసి కుక్కర్‌లో ఉడికించాలి. 3 విజిల్స్‌ వచ్చాక దించి ఉడికిన రవ్వను పొడిపొడిగా చేసి చల్లారనివ్వాలి.
* బాణలిలో 5 టీస్పూన్ల నూనె వేసి పచ్చిమిర్చి, ఇంగువ, వేరుసెనగగింజలు వేసి వేగాక మిగిలిన పోపు దినుసులు కూడా వేసి కరివేపాకు వేసి చిటపటమన్నాక దించాలి.
* ఈ తాలింపులోనే నిమ్మరసం పిండి, సరిపడా ఉప్పు వేసి రవ్వలో కలపాలి. చివరగా కొత్తిమీర చల్లితే నోరూరించే రవ్వ పులిహోర రెడీ. ఇష్టమైతే క్యారెట్‌ తురుము కూడా కలుపుకోవచ్చు.
Rice upma recipes,How to made Rice recipes
బియ్యపు ఉప్మా:-
కావలసిన పదార్థాలు:-
బియ్యం - 2 కప్పులు
కందిపప్పు - పవు కప్పు
ఆవాలు - 1 చెంచా
మినప్పుప్పు - అర చెంచా
శెనగపప్పు - 1 చెంచా
ఎండుమిర్చి - 3
నెయ్యి - 1 చెంచా
నూనె - 3 చెంచాలు
కరివేపాకు - 1 రెమ్మ
ఉప్పు, నీరు - తగినంత

తయారీ విధానం:-
బియ్యం, కందిపప్పు కలిపి నూక (రవ్వ) లా గ్రైండ్ చేసుకోవాలి లేదా విసురుకోవాలి. నూనె వేడిచేసి అవాలు, మినప్పుప్పు, శెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. వేగాక నాలుగు కప్పుల నీళ్లు పోయాలి. నీళ్లు మరిగాక కొబ్బరి తురుము, ఉప్పు వేయాలి. కాసేపు ఉడకనిచ్చి గ్రైండ్ చెసిన మిశ్రమాన్ని వేయాలి. దగ్గరగా అయ్యక నెయ్యి చల్లుకుని దించేసుకోవాలి.

వెజిటెబుల్ ఉప్మా

Vegetable Upma,Vegetable Upma Recipe
వెజిటెబుల్ ఉప్మా:-
కావలసిన పదార్థాలు:-
బొంబాయి రవ్వ - 2 కప్పులు
ఉల్లిపాయ - 1
క్యారెట్ - 1
టొమాటో - 1
బంగాళాదుంప - 1
కాలీఫ్లవర్ ముక్కలు - పావు కప్పు
పచ్చిమిర్చి - 3
ఆవాలు - 1 చెంచా
శెనగపప్పు - 1 చెంచా
మినప్పుప్పు - అర చెంచా
మిరియాల పొడి - 1 చెంచా
అల్లం ముక్క - చిన్నది
కరివేపాకు - 1 రెమ్మ
నెయ్యి - 1 చెంచా
ఉప్పు, నీరు - తగినంత
తయారీ విధానం:-
ముందు కూరగాయలను ఉడికించుకోవాలి. నెయ్యి వేడిచేసి శెనగపప్పు, మినప్పుప్పు, ఆవాలు , కరివేపాకు వేయాలి. వేగాక ఉల్లిపాయ, అల్లం,టొమాటో, పచ్చిమిర్చి ముక్కలను వేయాలి. రంగు మారాక కూరగాయ ముక్కలను వేయాలి. కాసేపు వేయించి నీరు,
 ఉప్పు,మిరియాల పొడి వేసి కలపాలి. నీళ్లు మరుగుతుండగా ఉప్మా రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలపాలి. దగ్గరగా అయ్యాక దించేసుకోవాలి. అంతే వెజిటెబుల్ ఉప్మా రెడి.

చిట్టి బూరెలు

South indian recipes

చిట్టి బూరెలు :-
కావలసినవి:-

పుల్లటి మజ్జిగ: 2 కప్పులు, మైదా: ఒకటిన్నర కప్పులు, బియ్యప్పిండి: ఒకటిన్నర కప్పులు, ఉప్పు: తగినంత, బజ్జీ మిరపకాయలు: 8, జీలకర్ర: కొద్దిగా, వంటసోడా: చిటికెడు, నూనె: 2 కప్పులు
తయారుచేసే విధానం:-
మజ్జిగలో మైదా, బియ్యప్పిండి, సోడా కలిపి పకోడీల పిండిలా గట్టిగా కలపాలి. కనీసం నాలుగు గంటలు నానబెట్టాలి. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు దంచి పిండిలో కలిపి నూనె కాగిన తరవాత చిన్న చిన్న పకోడీల మాదిరిగా వెయ్యాలి. (ఇవి బాగా పొంగుతాయి కనుక చిన్నవిగానే వేసుకోవాలి) మంట సన్నగా ఉండాలి. దోరగా వేగిన తరవాత తీసి వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.
Andhra Food Recipes

పుల్లట్లు

కావలసినవి:-
పుల్లటిమజ్జిగ: 3 కప్పులు, బియ్యం: కప్పు, మెంతులు: 2 టీస్పూన్లు, జీలకర్ర: స్పూను, పచ్చిమిరపకాయలు(బజ్జీ మిరపకాయలు): ఆరు, ఉప్పు: తగినంత, జీలకర్ర: స్పూను, నూనె: పావుకప్పు
తయారుచేసే విధానం:-
*మజ్జిగలో బియ్యం, మెంతులు నానబెట్టాలి. నాలుగు గంటల తరవాత మెత్తగా రుబ్బుకోవాలి.
*పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర.. దంచి పిండిలో కలిపి దోసెలపిండి మాదిరిగా పలుచగా చేసుకోవాలి.
*పెనంమీద కొద్దిగా నూనె రాసి పిండితో దోసె వేసి రెండువైపులా కాల్చి తియ్యాలి.

బటర్‌ ఇడ్లీ! 

                             
Andhra Breakfast Recipes, Idli special
కావలసినవి:
ఇన్‌స్టంట్‌ ఇడ్లీమిక్స్‌: 200గ్రా||, తాజా పెరుగు: పావు లీ.(గిలకొట్టాలి), మంచినీళ్లు: కప్పు, కొత్తిమీర తురుము: అరకప్పు, వెన్న: 50గ్రా||
తయారుచేసే విధానం: ఇడ్లీమిక్స్‌లో పెరుగు, నీళ్లు, కొత్తిమీర తురుము, సగం వెన్న వేసి కలిపి ఐదు నిమిషాలు నాననివ్వాలి. ఇడ్లీ ప్లేటుకు నూనె లేదా నెయ్యి రాసి ఇడ్లీ మిశ్రమాన్ని వేయాలి. ఒక్కో దానిమీద ఒక్కో జీడిపప్పు ఉంచి 15 నిమిషాలు ఆవిరి మీద ఉడికించి తీయాలి.
* కొత్తిమీర తురుము, వెన్నకి బదులుగా పెరుగు, నీళ్లు కలిపిన ఇడ్లీమిక్స్‌లో కొబ్బరి తురుము వేసి కొబ్బరి ఇడ్లీ, క్యారెట్‌ తురుము వేసి క్యారెట్‌ ఇడ్లీలు చేయవచ్చు.
* పాలకూర తురుము, పచ్చికొబ్బరి ముక్కలు మెత్తగా గ్రైండ్‌ చేసి, దాన్నిపెరుగు, నీళ్లతోపాటు ఇడ్లీమిక్స్‌లో కలిపి పాలక్‌ ఇడ్లీ చేయవచ్చు!

వడలు

Andhra Vadalu,Andhara Breakfast recipes

వడలు:-
మనం అనేక కూరల్లోనూ స్వీట్లలోనూ రుచికోసం కొబ్బరిని ఎక్కువగా వాడుతుంటాం. కొబ్బరితో రకరకాల వంటలు కూడా చేస్తుంటాం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొబ్బరితో కొన్ని వంటలు...
కావలసినవి:-
బియ్యంపిండి: ఒక కప్పు,
మైదా: అరకప్పు,
కొబ్బరి చిప్ప: సగం,
పచ్చిమిరపకాయలు: ఆరు,
జీలకర్ర: కొద్దిగా,
ఉప్పు: తగినంత,
నూనె: సరిపడా,
నీళ్ళు: ఒకటిన్నర కప్పులు
తయారుచేసేవిధానం:-
ముందుగా కొబ్బరి తురిమి ఉంచాలి. మైదా, బియ్యంపిండి కొబ్బరి తురుముతో కలపాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసి స్టవ్‌మీద పెట్టాలి. పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర గ్రైండ్‌ చేసి నీళ్లలో వెయ్యాలి. నీళ్ళు మరిగిన తరవాత ఒక స్పూను నూనె వేసి పిండి పోసి బాగా కలిపి దించాలి. చల్లారిన తరవాత కొద్దిగా నూనె రాసి నిమ్మకాయంత పిండి తీసుకుని, గుండ్రంగా వత్తి ఎర్రగా కాగిన నూనెలో వేయించి తియ్యాలి. ఇవి వేడివేడిగా తింటే బాగుంటాయి.

జొన్న రొట్ట

Andhra Breakfast Recipes, Andhra jonna Rotte special
ఒకప్పుడు బియ్యం ఖరీదైన ధాన్యం కావడంతో జొన్నరొట్టె పేదవారి ఆహారంగా ఉండేది. కానీ ఇటీవల ఆరోగ్యరీత్యా అయితేనేం... రుచి కారణంగా అయితేనేం... పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అంతటా జొన్నరొట్టె పట్ల మక్కువ చూపిస్తున్నారు.
కావలసినవి:-
తెల్లని బీజాపుర్‌ జొన్నలు: అరకేజి,
ఉప్పు: తగినంత,
నీళ్లు: సరిపడా
తయారుచేసేవిధానం:-
ముందుగా జొన్నల్ని కడిగి శుభ్రం చేసి ఎండలో పెట్టి మర పట్టించాలి. తరవాత ఆ పిండిలో ఉప్పు కలిపి ఉంచాలి. సుమారుగా 200 మిల్లీలీటర్ల నీటిని మరిగించాలి. ఉప్పు కలిపి ఉంచుకున్న జొన్నపిండిలో సగ భాగాన్ని ఈ మరిగించిన నీటిలో పోసి, చెక్క గరిటెతో బాగా తిప్పాలి. తరవాత పిండిని బాగా చల్లార్చాలి. ఇప్పుడు మిగిలిన జొన్న పిండిని కూడా నీళ్ళు కలిపిన పిండికి చేర్చి, అవసరమైతే మరికొన్ని నీళ్ళు చిలకరించి రొట్టెల పిండిలా బాగా కలపాలి. పిండి మృదువుగా తయారైంది అనుకున్న తరవాత ఒకసారి చాకుతో కోసి చూడండి.. అలా కోసినప్పుడు అది కత్తి అంచులకు అంటుకోకుండా ఉండాలి. తరవాత పిండి ముద్దలోంచి ఓ చిన్న ఉండను తీసుకుని గుండ్రంగా చేసి, చెక్క లేదా నున్నని రాయిమీద కాస్త పొడి జొన్న పిండి చల్లి అరచేతితో సున్నితంగా ఒత్తుతూ రొట్టెలా చేయాలి. ఇప్పుడు స్టవ్‌ మీద (రొట్టె కాల్చేందుకు బొగ్గుల కుంపటి అయితే మంచిది) జొన్న రొట్టెల పెనాన్ని ఉంచి, రొట్టెను వేయాలి. రొట్టెను పెనంమీద వేసేటప్పుడు పిండి వేసి ఒత్తిన అడుగుభాగం తప్పకుండా పైకి వచ్చేలా చూడాలి. తరవాత వెంటనే నీళ్లల్లో ముంచిన పలుచని బట్టను రొట్టెమీద కప్పాలి. బట్టమీదున్న నీరు ఆవిరైపోతుంటే రొట్టె కాలుతున్నట్లు అనుకోవాలి. మధ్య మధ్యలో బట్టమీద వేళ్లతో సున్నితంగా ఒత్తుతుంటే కిందున్న రొట్టె పొంగి బాగా కాలుతుంది. వేడివేడి రొట్టెను కోడి కూర లేదా వంకాయ కూరతో తింటే రుచి అదిరిపోతుంది. మెత్తని రొట్టె కాకుండా కరకరలాడే రొట్టె కావాలనుకునేవాళ్లు పెనం మీద నుంచి తీసిన రొట్టెను కొన్ని నిమిషాలు నేరుగా బొగ్గుల మీద ఉంచాలి.

దోసెలు|DOSHA

Andhra dosalu, Telugu Breakfast recipes
మనం అనేక కూరల్లోనూ స్వీట్లలోనూ రుచికోసం కొబ్బరిని ఎక్కువగా వాడుతుంటాం. కొబ్బరితో రకరకాల వంటలు కూడా చేస్తుంటాం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొబ్బరితో కొన్ని వంటలు...
కావలసినవి:-
కొబ్బరికాయ: ఒకటి,
బియ్యం: రెండు కప్పులు,
ఉప్పు: తగినంత,
జీలకర్ర: ఒక స్పూను,
పచ్చిమిరపకాయలు: 6,
నూనె: అరకప్పు
తయారుచేసేవిధానం:-
ముందుగా బియ్యం కడిగి నాలుగు గంటలు నానబెట్టాలి. తరవాత నీళ్లు వంచేసి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా దోసెల పిండిలా గ్రైండ్‌ చేయాలి. తరవాత పెనం మీద నూనె వేసి ఓ గరిటెడు పిండి వేసి పలుచగా దోసెలు పోసి రెండువైపులా కాల్చాలి. వీటిని వేడివేడిగా కారప్పొడితో తింటే బాగుంటాయి.

మెంతి దోశలు

Andhra dosalu , Telugu dosa recipes

మెంతిదోశే-

కావలసిన పదార్థాలు :-
మినప్పప్పు - 150 గ్రాములు, బియ్యప్పిండి - ఒక కప్పు, ఎండిన మెంతి ఆకులు - 3 టీస్పూన్లు, తురిమిన కేరెట్‌ - ఒక కప్పు, తినే సోడా మూడు చిటికెలు, ఉప్పు -రుచికి తగినంత, నూనె - సరిపడా.

తయారుచేసే విధానం :
మినప్పప్పుని రాత్రే నానబెట్టాలి. ఉదయం నీటిని వడకట్టి దోశల పిండిలా రుబ్బుకోవాలి. అందులో బియ్యప్పిండిని, తురిమిన కేరెట్‌ని, మెంతి ఆకుల్ని, సోడాని, ఉప్పుని వేసి బాగా కలపాలి. దీన్ని మామూలుగా దోశల్లా వేసుకుని కొబ్బరి చట్నీ లేక పుదీనా చట్నీతో తింటే బాగుంటుంది.

Comments