FOODRECIPES VEG

పార్శీ రైస్
బాస్మతి బియ్యం - ఒక గ్లాసు
ఉల్లిపాయలు - 50గ్రా.
మిరియాలు - ఒక స్పూను
లవంగాలు - ఎనిమిది
పంచదార - చెంచా
నెయ్యి - 75గ్రా.
దాల్చినచెక్క - నాలుగు ముక్కలు
నల్ల యాలకులు - ఆరు
ఉప్పు - తగినంత
జీడిపప్పు - ఆరు పలుకులు

తయారీ విధానం : 
ముందుగా కుక్కర్లో పంచదార వేసి వేయించాలి. తర్వాత అందులో నెయ్యి వెయ్యాలి. ఇది మరుగుతుండగా లవంగాలు, నల్లయాలకులు, మిరియాలు, దాల్చినచెక్క వేసి వేగాక ఉల్లిపాయ తరగు వేసి బాగా వేయించాలి. ఇందులోనే కడిగిన బాస్మతిబియ్యం వేసి వేయించాలి. బియ్యానికి రెండింతల నీళ్లు పోసి, తగినంత ఉప్పు వేసి మూత పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దించాలి. అంతే పార్శీ రైస్ రెడీ. 


                               పైనాపిల్ రైస్


సాధారణంగా ఎవరైనా పైనాపిల్‌ను ముక్కలు కోసిగాని, లేదంటే జ్యూస్ చేసుకుని గాని తింటారు. కానీ దీంతో స్వీట్ చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇది చెయ్యడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. తక్కువ టైంలోనే తయారయ్యే పైనాపిల్ రైస్ ఎంతో రుచిగా ఉంటుంది.

కావలసిన పదార్థాలు : 
బాస్మతి బియ్యం - పావు కిలో, పంచదార - 2 కప్పులు, పైనాపిల్ - ఒకటి, నెయ్యి - పావు కప్పు, జీడిపప్పు, కిస్‌మిస్, ఎండు ద్రాక్ష - పావుకప్పు.

తయారీ విధానం : 
ముందుగా బాస్మతి బియ్యంతో పొడిపొడిగా ఉండేట్టు అన్నం వండుకుని పక్కన పెట్టుకోవాలి. పైనాపిల్ పండును తొక్క తీసి తురిమి ముద్దచేసి రసంతో సహా ఓ గిన్నెలో ఉంచుకోవాలి. ఇప్పుడీ ముద్దను చక్కెరతో కలిపి ఓ నాన్‌స్టిక్ మూకుడులో వేసి ఉడికించుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు మొదట నీళ్లులాగా అయి కాసేపటికి చిక్కగా అవుతుంది. ఇప్పుడు అందులో ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి శుభ్రంగా కలిపి నెయ్యి వెయ్యాలి. చివరగా వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్ పలుకులు వేసి మళ్లా కలిపి కాస్త కుంకుమ పువ్వును పాలల్లో కలిపి చల్లితే పైనపిల్ రైస్ సిద్ధమవుతుంది. 


క్యాసో బిర్యాని

కావలసిన పదార్థాలు : 
బియ్యం- 300గ్రా, సొరకాయ- 100గ్రా, క్యారెట్-2, లవంగం-1, యాలకులు- తగినంత, చెక్క- చిన్నముక్క, జీలకర్ర- పావు చెంచా, అనాసపువ్వు- చిన్నముక్క, నెయ్యి- 1చెంచా, నూనె- 1చెంచా, బగార ఆకులు-2, కరివేపాకు- సరిపడా, కొత్తిమీర- చిన్నకట్ట, పచ్చిమిరపకాయలు-3, ఉల్లిపాయలు-1, అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 చెంచా

తయారీ విధానం : 
బియ్యం ముందుగా అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేసిన తర్వాత లవంగం, దాల్చిన చెక్క, అనాసపువ్వు, యాలకులు, జీలకర్ర, బగారా ఆకు వేసి వేయించాలి. తర్వాత క్యారట్, సొరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇప్పుడు నానిన బియ్యాన్ని స్టౌపై ఉడికించాలి. తర్వాత పై మిశ్రమాన్ని, కొత్తిమీర అన్నంలో కలపి సన్నని మంటపై కొంచెంసేపు ఉంచి దించేయాలి. దాంతో క్యాసో బిర్యానీ రెడీ అయినట్లే. దీనికి క్యారట్ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డిస్తే సరి. 

పంచపప్పుల రైస్












కావలసిన పదార్థాలు :
బియ్యం - 3 కప్పులు
పెసరపప్పు - అర కప్పు
కందిపప్పు - అరకప్పు
శెనగపప్పు - అర కప్పు
నెయ్యి - 100గ్రా
మిరియాలు - చెంచా
జీలకర్ర - చెంచా
జీడిపప్పు - 25గ్రా
ఉప్పు - తగినంత
కరివేపాకు - నాలుగు రెబ్బలు
కొత్తిమీర - కట్ట
పాలు - గ్లాసు

తయారీ విధానం : 
కుక్కర్లో నెయ్యి వేసి బాగా కాగాక జీడిపప్పు, జీలకర్ర వేయించి, కడిగిన బియ్యం, పప్పులు కూడా వేసి వాటికి రెండింతలు నీళ్లు పోసి, తగినంత ఉప్పు, పాలు పోసి మూత పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దించేయాలి. చల్లారిన తర్వాత మూత తీసి గరిటతో బాగా కలిపి కొత్తిమీరతో అలంకరించుకోవాలి. అంతే పంచపప్పుల రైస్ రెడీ. 

రొయ్యల క్రీమీ బిర్యానీ


కావలసిన పదార్థాలు : 
రొయ్యలు - అరకిలో, ఉల్లిపాయలు - 4
పచ్చిమిర్చి - 4, బియ్యం - అరకిలో
నూనె - 4 చెంచాలు, నెయ్యి లేదా డాల్డా - 100గ్రా., అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2చెంచాలు,
నీళ్లు - 4గ్లాసులు, దాల్చిన చెక్క - చిన్నవి 2,
లవంగాలు - 5, యాలకులు - 5
మరాఠి మొగ్గలు - 5, బిర్యాని ఆకులు - 4
జాజికాయ - 1, పెరుగు - రెండు కప్పులు

పొడి చేసుకోవడానికి : జాపత్రి - పావు తులం, యాలకులు - పావు తులం, లవంగాలు - పావు తులం, దాల్చిన చెక్క - పావు తులం, ఉప్పు - చిటికెడు కారం - చిటికెడు, పసుపు - చిటికెడు.

తయారీ విధానం : 
ముందుగా రొయ్యలను శుభ్రం చేసుకోవాలి. నీరు లేకుండా చేసి అందులో చిటికెడు ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకోవాలి. తరువాత సన్నని మంట మీద పది నిమిషాలు ఉంచి దించేయాలి. రొయ్యల లోని నీరు బయటకు వచ్చాక రెండిటినీ వేరుచేయాలి. అలాగే బియ్యాన్ని కడిగి నీరు లేకుండా ఆరబెట్టాలి. తరువాత సన్నని మంటపై ఓ బాణలిపెట్టి అందులో నూనె వేసి కాగిన తరువాత కట్‌చేసి పెట్టుకున్న ఉల్లి, పచ్చిమిరపకాయల ముక్కలను వేయాలి. ఇవి కాస్త వేగిన తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠి మొగ్గ, బిర్యాని ఆకు వేయాలి. ఇవి వేసిన రెండు నిమిషాల తరువాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి అడుగు అంటకుండా ఉండేందుకు నెయ్యి వేయాలి. ఇప్పుడు రొయ్యలని రెండు భాగాలు చేసి అందులో ఒక భాగాన్ని బాణలిలో వేసి నాలుగు గ్లాసుల నీళ్లు పోసి, ఉప్పు వెయ్యాలి. ఈ నీళ్లు మరుగుతుండగా ఉప్పును సరిచూసుకొని యాలకులు, జాజిపత్రి, లవంగాలు...తో చేసి పెట్టుకున్న పొడిని ఒక చెంచా మరుగుతున్న నీళ్లలో వేయాలి. తరువాత అందులో బియ్యాన్ని వేయాలి. అనంతరం రెండో భాగం రొయ్యలను పైన వేసి చుట్టూ సర్దుకుని ఆవిరిపోకుండా మూత పెట్టి మరో పదిహేను నిమిషాలు ఉంచితే సరి. ఘుమఘుమలాడే రొయ్యల క్రీమీ బిర్యాని సిద్ధం అవుతుంది. దీనికి కాస్త ఉల్లి-పెరుగు జోడిస్తే యమా టేస్టీగా ఉంటుంది. 

క్యాప్సికమ్ రైస్
















కావలసిన పదార్థాలు : 
బియ్యం - కప్పు
క్యాప్సికం - 3
ఎండు మిరపకాయలు - 2
ఆవాలు - చెంచా
మినప్పప్పు - 3 చెంచాలు
శనగపప్పు - 3 చెంచాలు
ధనియాలు - చెంచా
పసుపు - అరచెంచా
దాల్చిన చెక్క - చిన్నది
ఉప్పు, నూనె - తగినంత

తయారీ విధానం : 
ముందుగా అన్నం వండి పెట్టుకోవాలి. ఎండు మిరపకాయలు, దాల్చిన చెక్కలను వేర్వేరుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడో బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత ఆవాలు, శనగపప్పు, క్యాప్సికం ముక్కలను వేయాలి. ఇవి వేగిన తరువాత మంట తగ్గించి పసుపు, ఉప్పు, మిరప, దాల్చిన చెక్క పొడులను వేసి బాగా కలపాలి. మరో ఐదు నిమిషాల తర్వాత అన్నాన్ని వేసి బాగా కలిపి దించుకోవాలి. పైన కాస్త నెయ్యి చల్లుకుంటే సరి. నోరూరించే క్యాప్సికం రైస్ రెడీ.

పుదీనా - రాజ్మా బిర్యాని













కావలసిన పదార్థాలు : 
బియ్యం - కేజీ
పుదీనా - నాలుగు కట్టలు
రాజ్మా గింజలు - 200 గ్రా
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిరపకాయలు - ఆరు
నూనె - 100గ్రా
నెయ్యి - 100గ్రా
లవంగాలు - 6
దాల్చినచెక్క - చిన్న ముక్కలు నాలుగు
 ఉప్పు - తగినంత

తయారీ విధానం : 
ముందురోజు రాత్రి రాజ్మా గింజల్ని నానబెట్టాలి. బిర్యానీ తయారు చేయడానికి ముందు బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలి. కాడలు లేకుండా పుదీనా ఆకులను తుంచి శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసుకోవాలి. వెడల్పుగా ఉన్న గిన్నెలో నూనె, నెయ్యి వేసి కాగిన తర్వాత లవంగాలు, దాల్చినచెక్క వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, రాజ్మాగింజలు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఇప్పుడు పుదీనా పేస్టు వేసి దోరగా వేయించి తగినంత నీరు పోసి ఉప్పు వేయాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం వేసి ఉడకనివ్వాలి. అంతే పుదీనా - రాజ్మా బిర్యానీ రెడీ అయినట్లే. 

ఎగ్ వెజిటబుల్ ఫ్రైడ్‌రైస్














కావలసిన పదార్థాలు : 
కోడిగుడ్లు - రెండు, బియ్యం - అరకిలో
క్యారెట్ ముక్కలు - అరకప్పు, బీన్స్ ముక్కలు - అర కప్పు
పచ్చిబఠాణీలు - అరకప్పు, పచ్చిమిరపకాయలు - రెండు
సోయాసాస్ - చెంచా, టమోటాసాస్ - చెంచా
అజినోమోటో - చెంచా, ఉప్పు - తగినంత
కారం - చెంచా, మిరియాలపొడి - అరచెంచా
కొత్తిమీర తురుము - అర కప్పు, నూనె - తగినంత


తయారీ విధానం : 
ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాణలిలో కొంచెం నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత కోడి గుడ్లు కొట్టి వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత క్యారెట్, బీన్స్, బఠాణీలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొంచెం మగ్గనివ్వాలి. అందులో సోయాసాస్ వేసి బాగా కలపాలి. తర్వాత అందులో అన్నం వేసి అజనొమోటో, టమాటాసాస్, సోయాసాస్, ఉప్పు, కారం, మిరియాలపొడి వేసి బాగా కలపాలి. చివరికి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే వేడి వేడి ఎగ్ వెజిటబుల్ బిర్యాని రెడీ. 

పెసరపునుకుల బిర్యానీ


కావలసిన పదార్థాలు : 
పెసరపప్పు - 159 గ్రా
బాస్మతి బియ్యం - అరకిలో
యాలకులు - 4, లవంగాలు - 8
దాల్చినచెక్క - రెండు ముక్కలు
బిర్యాని ఆకులు - రెండు
సాజీరా - చెంచా
అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు చెంచాలు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిరపకాయలు - 8
కొత్తిమీర - కట్ట, పుదీనా - కట్ట
 నూనె - సరిపడా
 నెయ్యి - చెంచా
  ఉప్పు - తగినంత
   నీళ్లు - సరిపడా

తయారీ విధానం : 
పెసరపప్పును రెండు గంటల ముందు నానబెట్టాలి. నానిన పప్పును కొంచెం బరకగా రుబ్బుకుని కొంచెం ఉప్పు కలుపుకోవాలి. బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత రుబ్బిపెట్టుకున్న పెసరపిండిని చిన్న చిన్న పునుకులుగా వేసి వేయించుకోవాలి. తర్వాత బాస్మతి బియాన్ని కడిగి పది నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నెలో నెయ్యి, నూనె పోసి కాగిన తర్వాత లవంగాలు, సాజీరా, యాలకులు, దాల్చినచెక్క, బిర్యానిఆకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా వేసి వేగిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న బియ్యాన్ని రెండు నిమిషాలు వేయించి, బియ్యానికి రెండు రెట్లు నీరు పోయాలి. సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. సగం ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న పునుకులు, కొత్తిమీర వేసి కలిపి ఆవిరి పోకుండా మూతపెట్టి సన్నటి సెగపై ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి. అంతే పెసర పునుకుల బిర్యాని సిద్ధం. 

క్యారెట్ -65









కావలసిన పదార్థాలు : 
క్యారెట్ - 250గ్రా.,
మైదా - 50గ్రా., శనగపిండి - 50గ్రా., అల్లం వెల్లుల్లి - చెంచా, ఉప్పు - తగినంత, పెరుగు - కప్పు, పచ్చిమిరపకాయలు - 20గ్రా., కరివేపాకు - కట్ట
నూనె - వేయించడానికి సరిపడా, కారం - చెంచా, ఆరెంజ్ కలర్ - అర చెంచా.


తయారీ విధానం : 
ం క్యారెట్‌ను శుభ్రం చేసి గుండ్రంగా చిన్న చిన్న చక్రాల్లా కోసుకోవాలి.
ం ఒక గిన్నెలో శనగపిండి, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, పెరుగు, ఆరెంజ్ కలర్‌ను కలిపి బజ్జీల పిండిలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి.
ం ఈ పిండిలో క్యారెట్ ముక్కలను ముంచి వేడి నూనెలో ఎర్రగా వేయించాలి.
ం ఇంకో బాణలిలో కొద్దిగా నూనె పోసి నిలువుగా చీల్చిన పచ్చి మిరపకాయలు, కరివేపాకు రెబ్బలను వేసి బాగా వేయించండి. ఇందులో వేయించిన క్యారెట్ ముక్కలు కలిపి మరో మూడు నిమిషాలు ఫ్రైచేయాలి.అంతే 'క్యారెట్ - 65' రెడీ. 

Tomato Chutney, Recipe of Tomato Chutney




కావలసిన పదార్థాలు: పచ్చి టమోటాలు - పావుకేజి, నల్ల / తెల్ల నువ్వులు (వేగించినవి) - 100 గ్రా., పచ్చిమిర్చి - 4, వెల్లుల్లి - 6 రేకలు, జీలకర్ర - 1 టీ స్పూను, చింతపండు - 2 రెబ్బలు, నూనె - 1 టేబుల్ స్పూను.

తయారుచేసే విధానం: కడాయిలో నూనె వేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్రను వేగించి తీసేయాలి. మిగిలిన నూనెలో (నాలుగు ముక్కలుగా) తరిగిన టమోటా కాయల్ని వేసి మగ్గనివ్వాలి. టమోటాలు దించేసి, చల్లారిన తర్వాత మిక్సీలో నువ్వులు + జీలకర్ర, పచ్చిమిర్చి+ వెల్లుల్లి +చింతపండు (స్పూను నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి), టమోటా ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసి ఉప్పు జతచేసి గ్రైండ్ చేసుకోవాలి. వేడివేడి అన్నంతో ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది

టొమాటో రైస్

టొమాటో రైస్‌:-

tomoto Rice Recipes
కావలసినవి:
బియ్యం: అరకిలో, జీలకర్ర: టేబుల్‌స్పూను, ఆవాలు: టీస్పూను, ఉల్లిపాయ: ఒకటి, టొమాటోముక్కలు: 2 కప్పులు, కరివేపాకు: కట్ట, పచ్చిమిర్చి: మూడు, గరంమసాలా: అరటీస్పూను, కారం: అరటీస్పూను, కొత్తిమీర: కట్ట, పసుపు: చిటికెడు, నూనె: పావుకప్పు, వేడినీళ్లు: ఒకటింపావు లీటరు, ఉప్పు: తగినంత.

తయారుచేసే విధానం
* బియ్యం కడిగి వేడినీళ్లలో 15 నిమిషాలు నాననివ్వాలి.
* మందపాటి బాణలి తీసుకుని నూనె లేదా నెయ్యి లేదా వెన్న వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరవాత తరిగిన ఉల్లిముక్కలు కూడా వేసి మరికాసేపు వేయించాలి. టొమాటోముక్కలు కూడా వేసి ఓ రెండు నిమిషాలు వేయించాలి.
* బియ్యం కూడా వేసి మరో అరనిమిషం వేయించాలి. తరవాత జీరా రైస్‌లో మాదిరిగానే బియ్యంకొలతకి రెట్టింపు అంటే సుమారు లీటరు పైగా నీళ్లు పోసి తగినంత ఉప్పు వేయాలి.
* అన్నం మూడువంతులు ఉడికిన తరవాత కొత్తిమీర కూడా వేసి మంటతగ్గించి మూతపెట్టి ఉడికించాలి. మూడు నిమిషాల తరవాత అన్నం ఉడికిందో లేదో చూశాక దించాలి.









కందిపప్పుతో...కిచిడీ

Andhra rice recipes Telugulo
కందిపప్పుతో...కిచిడీ :-
కావలసినవి:-
బాస్మతి బియ్యం: 300గ్రా||, కందిపప్పు: 100గ్రా||, నెయ్యి: 50గ్రా||, పలావు ఆకు: ఒకటి, యాలకులు: 3, పసుపు: టీస్పూను, దాల్చినచెక్క: చిన్నముక్క, లవంగాలు: 5, పచ్చిమిర్చి: 4, జీలకర్ర: అర టీస్పూను, ఉల్లిపాయ: ఒకటి, అల్లం తురుము: టీస్పూను, వెల్లుల్లి: టీస్పూను, దనియాలపొడి: టీస్పూను, కరివేపాకు: 5 రెమ్మలు, పెరుగు: 2 టీస్పూన్లు, ఉప్పు: సరిపడా, వెన్న: టీస్పూను
తయారుచేసే విధానం:-
* బియ్యం, కందిపప్పు వేరువేరుగా కడిగి ఓ అరగంటసేపు నాననివ్వాలి.
* లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు అన్నీ పొడి కొట్టాలి.
* ఓ పెద్ద పాన్‌లో నెయ్యి వేసి వేడి చేయాలి. తరవాత జీలకర్ర, పలావు ఆకులు, కరివేపాకు, మసాలా పొడి వేయాలి.
* అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఓ రెండు నిమిషాలు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. తరవాత పసుపు, పెరుగు, ఉప్పు వేయాలి.
* నీళ్లు వంపేసిన కందిపప్పు, బియ్యం కూడా వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు అరలీటరు నీళ్లు పోసి ఉడికించాలి. సగం ఉడికిన తరవాత సెగ తగ్గించి పూర్తిగా ఉడికే వరకూ ఉంచాలి. చివరగా వెన్న వేసి కొత్తిమీర చల్లి దించితే కందిపప్పు కిచిడీ రెడీ!




Comments